పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అధికారులు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏలూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అనంతరం రహదారులను పోలీసులు దిగ్బంధం చేస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. జిల్లాలో మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం వల్ల లాక్డౌన్ను అమలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
జిల్లాలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల అధికారులు లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేశారు. 289 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలు అనంతరం రోడ్డుపై వచ్చే వాహనాలను నిలిపివేశారు.
జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు