ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... చిక్కిన నిందితుడు - lock house-thefting_two impressionment

రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి సుమారు పది లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... పోలీసుల అదుపులో నిందితుడు

By

Published : Jun 6, 2019, 1:32 PM IST

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ సీఐ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 29.6 తులాల బంగారు ఆభరణాలు.. 50 వేల నగదు, 2ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు మద్దూరు గ్రామానికి చెందిన పిల్లి సతీష్ తణుకు మండలం దువ్వ, నిడదవోలు, కొవ్వూరులతోపాటు ఖమ్మం జిల్లా, హైదరాబాదులోనూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు విలాసాలకు అలవాటుపడి చోరీ చేయడం ప్రారంభించాడని తణుకు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలోనే చోరీల కేసులో జైలు శిక్షనుభవించినట్లు వివరించారు. బయటికొచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... నిందితుడు అరెస్టు

భక్తిశ్రద్ధలతో భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details