కరోనా విజృంభిస్తున్న తరుణంలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని కలెక్టర్ ముత్యాల రాజు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,500లకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అధిక కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేయనున్నారు.
తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఆకివీడు పంచాయతీల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 42 మండలాల్లోని 83 గ్రామాల్లో లాక్డౌన్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఈనెల 31 వరకు లాక్డౌన్ ఉంటుంది. నిత్యావసర దుకాణాలు ఉదయం 11 గంటలవరకు, మందుల దుకాణాలు రోజంతా తెరవడానికి అనుమతి ఇచ్చారు.