ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 8:46 PM IST

ETV Bharat / state

జిల్లాలో కరోనా వ్యాప్తితో లాక్​డౌన్.. 71 ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఏలూరులో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందిన 71 ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

lock down
lock down

పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగంరలో వారం రోజులపాటు.. లాక్ డౌన్ విధించారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోనూ లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు నగరంలో ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఇచ్చారు. నగరంలో వాహనదారులు రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేశారు.

జిల్లాలో కొవిడ్ విజృంభించిన 71 ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఏలూరు నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదు కావడంతో అధికారులు లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లు, ఇతర మార్కెట్లను మూసివేశారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details