కరోనా వైరస్ నివారణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా పోలీసులు పట్టణ ప్రజల సంచారాన్ని ఎక్కడికక్కడ పరిమితం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను సైతం నిరోధించేలా.. పట్టణం అన్ని వైపులా రహదారులను మూసి వేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. నిత్యావసర వస్తువులకు ఆటంకం లేకుండా చూస్తామని పట్టణ సీఐ చైతన్య కృష్ణ తెలిపారు. ప్రజలూ తమ విధి నిర్వహణకు సహకరించాలని కోరారు.
పోలీసులకు ప్రజలు సహకరించాలి: తణుకు సీఐ చైతన్య కృష్ణ - carona in west godavari
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ను కట్టదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువులకు అటంకం లేకుండా చూస్తామని పట్టణ సీఐ భరోసా ఇచ్చారు.
కరోనాపై తణుకులో చర్యలు