ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంగారెడ్డి గూడెంలో పటిష్ట బందోబస్తు... - కరోనా వైరస్ జంగారెడ్డిగూడెం

కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రమంతటా లాక్​డౌన్ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు.

lock down in jangareddy gudem
జంగారెడ్డి గూడెంలో పటిష్ట బందోబస్తు... వాహనదారులపై చర్యలు

By

Published : Mar 24, 2020, 11:42 PM IST

జంగారెడ్డి గూడెంలో పటిష్ట బందోబస్తు... వాహనదారులపై చర్యలు

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్​ను తరిమికొట్టేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం మంతటా లాక్ డౌన్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జాతీయ రహదారితో పాటు పట్టణం నలుమూలల పోలీసులు పహారా కాస్తున్నారు. బుట్టాయిగూడెం మండలం అంకంపాలెంలో గిరిజనులు తమ గ్రామంలో ఎవరు రాకూడదంటూ గ్రామ సరిహద్దుల్లో కంచెను వేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలను అప్రమత్తం చేస్తూ... మాట వినని వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు రానివ్వడం లేదు. సాయంత్రం ఒక గంట మాత్రమే నిత్యవసర వస్తువులు తీసుకునేందుకు బయటకు రావాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చూడండి-పోలీసు పహారా: పశ్చిమగోదావరిలో పూర్తిస్థాయి లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details