లాక్ డౌన్ వంటి విపత్తులోనూ అతికష్టం మీద రైతులు పంటలు పండించారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ఎగుమతులు నిలిచి.. ధరలు పతనమయ్యాయి. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను సాధారణ ధర కంటే.. అతి తక్కువ ధరకు విక్రయించారు. పశ్చిమగోదావరిజిల్లాలో రైతులు లాక్ డౌన్ వల్ల.. తీవ్రంగా నష్టపోయారు. చేపలు, రొయ్యలు, పండ్లతోటలు, కూరగాయలు, ధాన్యం రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయించారు. ఈ విపత్తులో ఆహారం అందించిన అన్నదాతను మాత్రం మరిచిపోయారంటూ.. రైతు సంఘాలు నేతలు... అన్నదాతలకు అభినందన కార్యక్రమాన్ని ఏలూరులో ఏర్పాటు చేశారు. రైతు సంఘాలు, ప్రజాసంఘాలు రైతు బజారులో రైతులకు పుష్పగుచ్ఛాలు అందించి.. అభినందలు తెలిపాయి. విపత్తులో రైతు కష్టాన్ని ప్రభుత్వాలు గుర్తించడంలేదని.. రైతును ఆదుకోవాలని వారు కోరారు. కోవిడ్ విపత్తులో అందరికి ఆహారం అందించిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆకలి తీరుస్తున్న అన్నదాతకు అభినందనలు.. - లాక్డౌన్తో రైతుల సమస్యలు వార్తలు
లాక్ డౌన్ వల్ల.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. విపత్కర పరిస్థితుల్లోను ప్రజలకు ఆహారాన్ని అందించారు. అలాంటి అన్నదాతలను సత్కరించడానికి పలు రైతు, ప్రజాసంఘాలు ముందుకు వచ్చాయి. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు రైతు బజారులో పలువురు రైతులకు పుష్పాలు అందించి.. అభినందనలు తెలిపారు. విపత్తులో ప్రజల ఆకలి తీర్చిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి.
lock down effect on west godavari farmers