కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతుంది. పాలకేంద్రాలు, మందులు దుకాణాలు మినహా ఇతర దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతులు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనీ... ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నరసాపురంలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్డౌన్ - నరసాపురం లాక్డౌన్
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో... లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసరాలు మినహా అన్ని దుకాణాలు మూతలు పడ్డాయి.
నరసాపురంలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్డౌన్