పచ్చని వాతావరణంతో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల నగరాతో వేడెక్కింది. సభలు, సమావేశాలతో అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు నేతలు కసరత్తులు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో తెదేపా, వైకాపా పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.
అభ్యర్ధుల ఎంపికలతో వేడెక్కిన పశ్చిమ గోదావరి - స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల తాజా వార్తలు
రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది. రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలయ్యాయి. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడం వల్ల సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
![అభ్యర్ధుల ఎంపికలతో వేడెక్కిన పశ్చిమ గోదావరి west godavari local elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6344596-1014-6344596-1583727543255.jpg)
పశ్చిమ గోదావరిలో స్థానిక ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు
పశ్చిమ గోదావరిలో స్థానిక ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు
ఏడు పురపాలక సంఘాలకు రిజర్వేషన్లు ఖరారు కాగా.. ఏలూరు నగరపాలిక మేయర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఛైర్మన్ సీటు, జంగారెడ్డిగూడెం, తణుకు స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. కొవ్వూరు ఎస్సీ (మహిళ), నరసాపురం, భీమవరం స్థానాలు బీసీ (మహిళ), పాలకొల్లు జనరల్‌కు కేటాయించారు. ఖరారైన రిజర్వేషన్ల మేరకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
ఇవీ చూడండి...