ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ' - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో 885 ఎంపీటీసీ స్థానాలు, 48 జడ్పీటీసీ స్థానాలు, 888 పంచాయతీలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయడంలో నిబంధనలు పాటించడం లేదంటూ ప్రజావ్యాజ్యం దాఖలు కావడంపై స్పందించిన సుప్రీంకోర్టు వీటి నిర్వహణకు బ్రేక్​ వేసింది. దీని వల్ల స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

local-body-elections-in-ap
local-body-elections-in-ap

By

Published : Jan 30, 2020, 10:30 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 176వ జీవో ప్రకారం ఎస్సీ ,ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాజ్యాంగ నిబంధన ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని సవాల్ చేస్తూ పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి రెండు వారాలు గడిచిపోవడం వల్ల మరో రెండు వారాల్లోగా హైకోర్టు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే

హైకోర్టు జారీ చేసిన నివేదిక అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 885 ఎంపీటీసీ, 48 జడ్పీటీసీ, 888 పంచాయతీలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. జిల్లాలో 909 పంచాయతీలు ఉండగా రెండు పంచాయతీలు పోలవరం ప్రాజెక్టు పరిధిలోనికి రావడం వల్ల వాటిని డీ నోటిఫైడ్ పంచాయతీలుగా గుర్తించారు. మరో 19 పంచాయతీలు వివిధ పురపాలక సంఘాల్లో విలీనం కావడం వల్ల 888 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. తాజాగా సవరించిన ఓటర్ల తుది జాబితాలను ఫిబ్రవరి 14న ప్రకటించనున్నారు. ఈ జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

వలపు ఉచ్చు..సిబ్బంది వేతన ఖాతాల్లోకే పాక్ సొమ్ము

ABOUT THE AUTHOR

...view details