స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో.. హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన పనిపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా ఎస్టీలు.. తర్వాత ఎస్సీలు.. తదనంతరం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు పూర్తి చేసిన తర్వాత జనరల్ పై దృష్టి సారించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో 48 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 899 గ్రామ పంచాయతీలు, 9859 వార్డులు ఉన్నాయి. తాజాగా తయారు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 24, 17, 567 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల పోలింగ్ కేంద్రాల గుర్తింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గతంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన యంత్రాంగం.. ప్రస్తుతం రిజర్వేషన్లు మారినందున మరోసారి పోలింగ్ కేంద్రాలను గుర్తించవలసిన అవసరం ఏర్పడింది. జిల్లాలో సుమారుగా పది వేల పోలింగ్ కేంద్రాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.