పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మద్యం దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవులపల్లి, ధర్మాజీగూడెంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జూన్ లో దొంగతనాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం దమ్మపేట గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి.. పోలీసులు పట్టుకున్నారు.
అతని నుంచి లక్షా 30 వేల రూపాయల విలువచేసే 410 మద్యం సీసాలను జంగారెడ్డిగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా కేసులు ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాయక్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు.