జంగారెడ్డిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు - liquor bottles seized at west godavari
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్టుమెంటులో అక్రమ మద్యాన్ని అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మద్యం దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి... గత పాలసీలో మిగిలిన మద్యాన్ని ఇంట్లో పెట్టుకుని రహస్యంగా వ్యాపారం చేస్తున్నాడు. రూ.లక్ష విలువ చేసే 178 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
లక్ష రూపాయలు విలువ చేసే 178 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
TAGGED:
liquor bottles seized news