ఇంట్లో పిడుగుపడి రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం - పశ్చిమగోదావరి జిల్లా ముఖ్యవార్తలు
20:08 September 18
cash and gold burnt in house
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంటిపై పిడుగు పడింది. మంటలు వ్యాపించడంతో సుమారు 20 లక్షల నగదు, 50 కాసుల బంగారం దగ్దమైనట్లు బాధితులు తెలిపారు. తమ కుమారుడి చదువుల కోసం ఇటీవల పొలం విక్రయించి 20 లక్షల నగదు ఇంట్లో ఉంచామని.. పిడుగుపాటుతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయిందని కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: