పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం శ్రమిస్తామని జిల్లా చాంబర్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు. భీమవరం పట్టణంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తామని ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.
"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం" - పశ్చిమగోదావరి జిల్లా
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడతామని భీమవరంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.. ఈనాడు , ఈటీవీ- భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం"