ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ చికిత్స పేరుతో అధిక ఫీజు వసూలు చేస్తున్నారు' - పశ్చిమ గోదావరిలో కరోనా కేసులు

అనుమతి లేకున్నా కొన్ని ఆస్పత్రులు కొవిడ్ చికిత్స అందిస్తున్నాయని వామపక్షాలు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రోగుల వద్ద నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

left parties protest at eluru
వామపక్షాల నిరసన

By

Published : Aug 27, 2020, 6:25 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో ఎలాంటి అనుమతులులేకుండా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయని వామపక్ష నేతలు ఆరోపించారు. రోగుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేప్టటాయి. కొవిడ్ రోగులను భయపెట్టి.. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే కొవిడ్ ఆస్పత్రులను నిర్విహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాంటి ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేయాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details