ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో గోదావరి ఉద్ధృతి.. స్పిల్​వే వైపు భారీ వరద

గోదావరి ప్రవాహం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. జలవనరుల శాఖ వరదనీటిని పోలవరం స్పిల్​ వే వైపు మళ్లించింది. క్లస్టర్​ లెవెల్​ నీటితో నిండి పోయి... ప్రస్తుతం స్పిల్​వే గేట్లపై నుంచి ప్రవహిస్తోంది.

మరో అరమీటరు పెరిగితే స్పిల్​ వే గేట్లపై నుంచి విడుదల

By

Published : Aug 2, 2019, 10:31 AM IST

Updated : Aug 2, 2019, 11:17 AM IST

నీటిమట్టం మరో అరమీటరు పెరిగితే !
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పొంగి పొర్లుతోంది. జలవనరుల శాఖ అధికారులు ఎగువ కాపర్​ డ్యాం వద్ద నుంచి వరద నీటిని స్పిల్​ వే వైపు మళ్లించారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్​ వే రివర్స్​ స్లూయిజ్​ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. వరద స్పిల్​ వే గేట్ల క్లస్టర్​ లెవెల్​ ఎత్తు 25.72 మీటర్లు దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం స్పిల్​వే గేట్లపై నుంచి దిగువకు ప్రవహిస్తోంది. పైడిపాక పైలెట్ ఛానల్, గ్రావిటీ వల్ల రెండు వైపుల నుంచి వరద పోటెత్తుతోంది.
Last Updated : Aug 2, 2019, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details