పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో వైకాపా నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెదేపా ఆరోపించింది. 30 వేల నుంచి 75 వేల రూపాయల వరకు అక్రమంగా దండుకుంటున్నారని తెదేపా నేత ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.
'ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా అక్రమ వసూళ్లు' - పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పథకం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో ఇళ్లస్థలాల పట్టాల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
land issue
రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల నుంచి జె టాక్స్ వసూలు చేస్తుంటే.. తణుకు నియోజవర్గంలో ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో కే టాక్స్ వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడటమేంటని ఆయన ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఖేల్రత్న రేసులో కిదాంబి శ్రీకాంత్