పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పాల్గొన్నారు. చింతలపూడి మండలంలోని చింతంపల్లి గ్రామం బర్రి కొండ అటవీ ప్రాంతంలో భూమిని సాగుచేస్తున్న 29 మంది రైతులకు 55 ఎకరాలపై హక్కు కల్పిస్తూ పత్రాలు పంపిణీ చేశారు. జలకళ, రైతు భరోసాతో సహా అన్ని పథకాలు ఈ భూములకు వర్తిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సూర్యనారాయణ, ఆర్డీవో రచన, తహసీల్దార్ ప్రమద్వర తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడిలో గిరిజనులకు పట్టాలు పంపిణీ - గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా...గిరిజనులకు పట్టాలు అందించారు. ఈ భూములకు రైతు భరోసా, జలకళ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
land deeds