ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్ను తీస్తుంటే... ప్రాణం పోయింది!

పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమగోదావారి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

పన్ను తీస్తుంటే... ప్రాణం పోయింది!

By

Published : Nov 8, 2019, 2:11 PM IST

Updated : Nov 8, 2019, 8:32 PM IST

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. కామవరపుకోట మండలం అంకాలగూడేనికి చెందిన నిజవరపు సావిత్రి.. పన్ను నొప్పితో బాధపడేది. జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేటు దంత వైద్య శాలను సంప్రదించగా.. పన్ను పాడైందనీ.. తొలగించాల్సిందే అని వైద్యులు సూచించారు. పన్ను తొలగించే క్రమంలో ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పంటిని తొలగించే క్రమంలో సావిత్రి ఆందోళనకు గురైన కారణంగా.. గుండె పోటు వచ్చి మృతి చెందిందని వైద్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Nov 8, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details