ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CURRENT BILL: కరెంటు బిల్లు చూసి వడ్రంగి కార్మికుడికి షాక్​..ఎంతంటే..! - Electricity bill in lakhs for a carpenter

వడ్రంగి పని చేసే ఓ కార్మికుడికి.. లక్షల్లో కరెంటు బిల్లు వచ్చింది. నెలనెలా రూ.2 వేలు బిల్లు వస్తేనే అంతా అనుకునే వ్యక్తికి.. ఆ బిల్లు చూడగానే షాక్​ తగిలింది. ఏం చేయాలో దిక్కుచోచని స్థితిలో అధికారుల దగ్గరకు పరిగెత్తాడు. అసలే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న తనకు.. ఆ బిల్లు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది.

Electricity bill
కరెంటు బిల్లు

By

Published : Aug 7, 2021, 5:04 PM IST

వందా కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ వినియోగదారుడికి షాక్ కొట్టింది. చేసేదేమీ లేక బిల్లు పట్టుకొని విద్యుత్ శాఖ అధికారుల వద్దకు పరుగులు తీశాడు.

కరెంటు బిల్లు

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంకు చెందిన కానూరి లింగాచారి వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పని చేస్తేనే అతని కుటుంబం పొట్ట నింపుకునే దుస్థితి. కరోనా కష్టకాలంలో అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా.. లక్షల్లో వచ్చిన కరెంట్ బిల్లు చూసి అయోమయానికి గురయ్యాడు. ప్రతి నెలా రు.2వేల లోపు వచ్చే విద్యుత్ బిల్లు.. జూలై చివరిలో ఏకంగా రూ.6,74,900 బిల్లు రావడంతో ఖంగుతిన్నాడు. వెంటనే విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీయగా.. అధికారులు అతని ఇంటికి వెళ్లి మీటర్​ను పరిశీలించారు.

విద్యుత్ ఏఈ శ్రీనివాస్​ను వివరణ కోరగా.. మీటర్​లో సాంకేతికలోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని తెలిపారు. వెంటనే మీటర్ మార్చి కొత్త మీటర్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ..వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: భాజపా

ABOUT THE AUTHOR

...view details