ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలక్ష్మి టెక్స్‌టైల్స్‌ ఎదుట కార్మికుల ఆందోళన - పశ్చిమగోదావరి జిల్లా అనంతలక్ష్మి టెక్స్​టైల్స్​ కార్మికుల నిరసన

కరోనా సాకుతో పశ్చిమగోదావరి జిల్లా వడ్లూరులోని అనంతలక్ష్మి టెక్స్‌టైల్స్‌ మూసి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. కర్మాగారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు.

labours protest to not close ananthalakshmi textile in west godavari
కార్మికులు రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలి

By

Published : Jul 6, 2020, 5:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లా వడ్లూరులో అనంతలక్ష్మి టెక్స్‌టైల్స్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కరోనా సాకుతో కర్మాగారాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారని కార్మికులు ఆందోళనకు దిగారు. కర్మాగారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కర్మాగారాన్ని మూసివేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.

కర్మాగారాన్ని తెరిపించి 400 కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని నినాదాలు చేశారు. సుమారు 200మందికి పైగా కార్మికులు కర్మాగారం వద్దకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో కర్మాగారాన్ని మూసివేసిన తర్వాత... మే 3న తిరిగి ప్రారంభించి పాత ముడిసరుకు, కాటన్‌తో కాండిల్స్‌ తయారు చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కల్పించుకుని కర్మాగారాన్ని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని.. కార్మికులు రోడ్డున పడకుండా చూడాలని నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details