లాక్డౌన్ సడలింపుతో స్వస్థలాలకు వలస కూలీలు - లాక్‌డౌన సడలింపుతో స్వస్థలాలకు వలస కూలీలు
లాక్డౌన్ సడలింపుతో వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. చాల రోజుల తర్వాత కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సడలింపుతో పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వగ్రామాలకు బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోగా వారందరిని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారిని తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చాల రోజుల తర్వాత కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.