పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల.. పేరెంట్స్ కమిటీ (పీఎంసీ) ఎన్నికలో రసాభాస నెలకొంది. సోమవారం ఉదయం జరిగిన పీఎంసీ ఎన్నిక చెల్లదంటూ కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 6, 8 తరగతులకు ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు సమక్షంలో ఎన్నికలు జరగ్గా... 7, 9, పది తరగతుల ఎన్నికలు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయని ఆ ఎన్నిక చెల్లదని వారించారు. ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా ఎన్నిక జరిగిందని కొందరు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక నాయకులు పాఠశాలకు వచ్చి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని పట్టుబట్టారు.
కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస - పేరెంట్స్ కమిటీ
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి ఉన్నత పాఠశాల పీఎంసీ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం జరిగిన ఎన్నికలు చెల్లవని... తిరిగి మరోసారి నిర్వహించాలని స్థానికులు పట్టుబట్టారు.

కొవ్వలి పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలో రసాభాస