ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లీడ్స్'... స్ఫూర్తిదాయక విజయగాథ!

చదివింది ఒకటి.. చేసేది ఒకటి. అయితేనేం.. బతికేందుకు, మరికొందరికి బతుకు తెరువు చూపేందుకు ఆ చదువొక్కటే మార్గం కాదని ఈ యువతి నిరూపించింది. కష్టాన్ని నమ్ముకుని.. లక్ష్యాన్ని చేరుకుని.. వందల మందికి బతుకు బాట చూపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందింది.

కోమలాదేవి

By

Published : May 7, 2019, 6:41 PM IST

'లీడ్స్'... స్ఫూర్తిదాయక విజయగాథ!

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామానికి చెందిన చలసాని కోమలాదేవి.. ఉపాధి అవకాశాల కల్పనలో ముందు నిలుస్తున్నారు. చదివింది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్​స్ట్రుమెంటేషన్ అయినా.. ఆసక్తికి అనుగుణంగా మరో రంగాన్ని ఎంచుకున్నారు. ఉపాధి పొందడమే కాక.. ఇతరులకూ బతుకుబాటు చూపాలని పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా సమున్నత ఫలితాలు సాధించారు.

వందలాది మందికి కంప్యూటర్ శిక్షణ

ఏలూరు నగరంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కోమలాదేవి... ఇప్పటి వరకు సుమారు 30 వేల మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. ఉద్యోగ అవకాశాలు చూపించారు. చదువుకోని వారికీ ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో.. 2014లో దుస్తుల తయారీతో మార్కెటింగ్ రంగంలో అడుగుపెట్టారు. సుమారు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

దస్తుల వ్యాపారంతో మరిందరికి ఉపాధి

ఏలూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, మచిలీపట్నం, తణుకు ప్రాంతాలతో పాటు.. దేశవ్యాప్తంగా 480 దుకాణాల్లో దుస్తుల అమ్మకాలు జరిపిస్తున్నారు. 'లీడ్స్' పేరుతో మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన దుస్తులు అందించాలని.. నేరుగా అమ్మకాలు చేస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్స్ రీఫామ్స్ సంస్థ.. జాతీయ స్థాయిలో దుస్తుల తయరీ, మార్కెటింగ్ రంగంలో పురస్కారాలను అందించింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు హెచ్. శివప్ప చేతులమీదుగా ఈ అవార్డును కమలాదేవి అందుకున్నారు.

ఉన్నతమైన ఆలోచనకు.. ప్రణాళికాబద్ధమైన ఆచరణ తోడైతే.. తాము బతకడమే కాదు. ఇతరులకూ ఉపాధి కల్పించొచ్చని నిరూపించారు.. కమలాదేవి.

ఇది కూడా చదవండి.విద్యుత్ వైర్లు తగిలి టిప్పర్ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details