కుంచించుకుపోతున్న కొల్లేరు... కన్నెత్తి చూడని అధికారులు - occupied
ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉన్న సరస్సుల్లో ఒకటైన కొల్లేరు సరస్సు మెలమెల్లగా కనుమరుగవుతోంది. కాపాడుకోవడానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అవి విఫలమవుతున్నాయి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేక ఒంటరవుతోంది.
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు అభయారణ్యం అక్రమాలపాలవుతోంది. ఏటికేడు దురాక్రమణలతో కనుమరుగుదశకు చేరుకొంది. కొల్లేరు సరస్సు పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినా... ఆ అధికారులు చర్యలు గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారు. కొల్లేరు వెళ్లే అన్ని రహదారుల్లోనూ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి... ఆక్రమణలు, కాలుష్యాన్ని నియంత్రించాలి. జరుగుతున్న తంతుమాత్రం వేరుగా ఉంది.. తనిఖీలు నామమాత్రమయ్యాయి. లక్షల ఎకరాల కొల్లేరు నేడు అధికారికంగా 76వేల ఎకరాల్లో విస్తరించింది. ఇందులోను అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వతుండటం వల్ల.. భవిష్యత్తులో కొల్లేరు ఉనికే ప్రశ్నార్థకంకానుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.