పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతుడు ఖండవల్లికి చెందిన రైతుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... ద్విచక్రవాహనాన్ని తొలుత ఢీకొని అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని పడిపోయింది. బస్సులో చిక్కుకున్నవారిని స్థానికుల సహకారంతో పోలీసులు బయటకు తీశారు. కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా... క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసి క్రమబద్ధీకరించారు.
అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. 20 మందికి గాయాలు - ఖండవల్లిలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లిలో ట్రావెల్స్ బస్సు.. అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం పక్కకు బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 20మందికి గాయాలయ్యాయి.
khandavalli-bus-accident