ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాలు కళకళ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక శోభ

కార్తీకమాసం నేపథ్యంలో...రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు స్వామి వారికి కార్తీకదీపాలు వెలిగించి...ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kartikamasam across the state
రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక శోభ

By

Published : Nov 23, 2020, 10:00 AM IST

కార్తీక సోమవారం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. కుటుంబాలతో సహా తరలివెళ్తున్న భక్త జనాలు.. ప్రత్యేక పూజలు, శివుడికి అభిషేకాలు, కార్తీక దీపాలతో.. ఆధ్యాత్మికతను పంచుతున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలను మార్మోగిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో...

వీరులపాడులో సంగమేశ్వర స్వామి ఆలయంలో మహిళలు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మాగల్లు శివాలయంలో కార్తీకదీపాలు వెలిగించి పూజలు చేశారు. తోట్లవల్లూరులో కృష్ణానది పాయలో దీపాలు వెలిగించారు.

ప్రకాశం జిల్లాలో..

చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం శివాలయాల్లో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోపిరాలలోని శివాలయంలో తెల్లవారుజామునుంచి శివునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. అలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించారు. గిద్దలూరు పట్టణం శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ప్రాంగణంలోని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ...మాస్కు ధరించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

నరసాపురం వశిష్ఠ గోదావరినదిలో వేకువజాము నుంచే నదిలో పుణ్య స్నానాలు ఆచరించి...కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు. దీపాలను నదిలో వదిలారు. జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. పార్వతి అమ్మవారిని మొక్క జొన్న పొత్తులతో ప్రత్యేక అలంకరణ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

ఐ.పోలవరం మండలం మురమళ్ళలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి.. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి సమీపంలో ఉన్న వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునున్నారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

ఇదీ చదవండి:

కర్నూలులో విమానాల మరమ్మతు కేంద్రం

ABOUT THE AUTHOR

...view details