పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పరివాహక ప్రాంతాల్లో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న ముంపు బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వెంటనే సహాయం అందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంట భాజపా జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ముంపు బాధితులను పరామర్శించిన కన్నా - flood victims
భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల పరివాహక ప్రాంతాల్లో గోదావరి నీటి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితుల సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ