లాక్ డౌన్ కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లించాలని కోరుతూ... పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో జ్యూట్ కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామానికి చెందిన 30 మంది కార్మికులు ఏలూరులోని జ్యూట్ మిల్లులో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేతనాలు కోతలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినా... యాజమాన్యం జీతాలు చెల్లించలేదు. దీనిపై కార్మికులు కొవ్వలిలో ఆందోళన చేశారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండుటెండలో నిరసన తెలిపారు.
లాక్డౌన్ కాలానికి జీతాలు ఇవ్వండి: జ్యూట్ కార్మికులు - కొవ్వలిలో ఏలూరు జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళన
లాక్ డౌన్ కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లించాలని కోరుతూ... పశ్చిమగోదావరి జిల్లా కొవ్వలిలో జ్యూట్ కార్మికులు ధర్నా చేశారు. వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండుటెండలో నిరసన తెలిపారు.

లాక్ డౌన్ జీతాలు ఇవ్వండి: జ్యూట్ కార్మికులు