ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూనియర్ అసిస్టెంట్​ ఆత్మహత్యాయత్నం... ఎందుకంటే..! - నాచుగుంటలో జూనియర్ సహాయకుడు ఆత్మహత్యాయత్నం

ఉత్తమ సేవా పురస్కారాల ఎంపిక విషయంలో అధికారుల నిర్ణయంతోనే తన భర్త వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నాచుగుంటలో జరిగింది.

junior assistant suicide attempt at nachugunta in westgodavari
నాచుగుంటలో జూనియర్ సహాయకుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 28, 2020, 5:56 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్న వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆత్మహత్యాయత్నం అందుకేనా...!
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని... ఉత్తమ సేవా పురస్కారాలకు వెంకటేష్​ ఎంపికయ్యాడు. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రమైన ఏలూరు వెళ్లాడు. మరికొద్ది క్షణాల్లో పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉండగా... జాబితాలో తన పేరును తీసివేసినట్లు ఉన్నతాధికారులు వెంకటేష్​కు తెలిపారు. మనస్తాపానికి గురైన ఆయన... కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. అధికారుల నిర్ణయంతోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన లారీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details