పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. తెలంగాణ మద్యం తరలిస్తున్న ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు మరికొందరు సహకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని చిన్నంపేటకు చెందిన వంగరు సాయిదత్తు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
తెలంగాణ మద్యం తరలిస్తున్న విలేకరులు అరెస్ట్
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని,.. అతనికి సహకరించిన ముగ్గురు విలేకరులతో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ కరిముల్లా షరీఫ్ తెలిపారు.
పథకం ప్రకారం వలపన్ని ప్రత్యేక నిఘా బృందం బుధవారం రాత్రి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వారిలో జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ కానిస్టేబుల్ నోడూరి దుర్గా గణేష్, ఏలూరుకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బూరుగు భాగ్యరాజు, అత్యం విశ్వనాథం, దేవవరపు విజయకుమార్ లతో పాటు మరి కొందరు సాయిదత్తుకు సహకరిస్తున్నట్లు తెలిసింది. వారిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కరిముల్లా షరీఫ్ గురువారం తెలిపారు. వారి నుంచి రూ.9 లక్షల విలువ చేసే మద్యం సీసాలను, రెండు కార్లు, ఒక బొలెరో వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: గిరిజన మహిళల జూట్ బ్యాగులు.. అటు ఉపాధి.. ఇటు పర్యావరణ పరిరక్షణ