కరోనా నివారణ చర్యల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పురపాలక సంఘ సిబ్బందికి.. జ్యూయలరీ దుకాణాల సంఘం ప్రతినిధులు అండగా నిలిచారు. మొత్తంగా 250 మందికి ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నారు. వేరు వేరు చోట్ల ఉన్న పోలీస్ సిబ్బందికి వాహనాల ద్వారా వెళ్లి అందిస్తున్నారు.
జ్యూయలరీ షాపు సంఘం ఆధ్వర్యంలో అల్పాహార వితరణ - Jewelry Shop Association food distribution news
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పురపాలక సంఘ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పట్ల జ్యూయలరీ దుకాణాల సంఘం తమ దాతృత్వాన్ని చాటుకుంది. 45 రోజులుగా వారందరికీ అల్పాహారం అందిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగేంత కాలం తమ వితరణ కొనసాగుతుందని దాతలు తెలిపారు.

Jewelry Shop Association Food Distribution