లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎస్సై సస్పెన్షన్ - westgodavari district crime news
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన సహా విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి ఎస్సై సాదిక్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. మసీదులో సామూహిక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిసినా చర్యలు తీసుకోలేదని అతనిపై ఆరోపణలు రుజువు కావటంతో చర్యలు తీసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి ఎస్సై ఎస్కె సాదిక్‌ను జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ సస్పెండ్ చేశారు. ఇటీవలి ఎస్సై అధికారుల అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లిలో ఉంటున్న తన తల్లిదండ్రులను ఎవరికీ తెలియకుండా తీసుకువచ్చారు. జీలుగుమిల్లి మసీదులో 15 మంది ప్రార్థనలు చేస్తున్నారని సమాచారం వచ్చినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆరోపణలపై ఎస్సైను ఇటీవల వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు.... ఆరోపణలు రుజువు కావటంతో సస్పెన్షన్ వేటు వేశారు.