పురుగుల మందు తాగి జవాన్ ఆత్మహత్య - gopinath jawan
ఏ కష్టమొచ్చిందో తెలియదు సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి తనువు చాలించాడు. తండ్రి అనారోగ్య కారణంగా స్వగ్రామానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో సీఆర్‌పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీనాథ్ ఇంట్లో పురుగులమందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో గోపినాథ్‌ను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోపీనాథ్ రెండేళ్లుగా మేఘాలయలోని దేశ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి సంజీవరావుకు అస్వస్థతగా ఉండటంతో గోపీనాథ్ మూడు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. అయితే.. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.