తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం అదృష్టమని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సిటీ కేబుల్, సాయిస్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి నెల 50 మంది చిన్నారులకు... దాతల నుంచి సేకరించిన రక్తాన్ని అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 50 మంది చిన్నారులకు నెలకు సరిపడా పోషకాహారం దాతలు అందజేశారు.
'తలసేమియా' చిన్నారులకు సిటీ కేబుల్ సాయం - జంగారెడ్డిగూడెంలో రక్తదానంలో పాల్గొన్న సీఐ తాజా వార్తలు
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జంగారెడ్డిగూడెంలో సిటీకేబుల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నాగేశ్వరనాయక్ పాల్లొని రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం సీఐ