జంగారెడ్డిగూడెం పురపోరులో ముగిసిన నామినేషన్ల పర్వం - latest news on jangareddy gudem muncipal elections
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పట్టణంలో 29 వార్డులకు వైకాపా, తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల్లో తలపడనున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
జంగారెడ్డిగూడెం పూరపోరులో ముగిసిన నామినేషన్ల పర్వం