పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరోనా పాజిటివ్ రెండో కేసు నమోదయ్యింది. విజయవాడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో బాధితుడు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నాలుగు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళారు. అక్కడ రక్త పరీక్షలు చేసి అనుమానంతో కొవిడ్ పరీక్షలకు పంపారు. పాజిటివ్ రావటంతో పురపాలక అధికారులు అప్రమత్తమయ్యారు.
జంగారెడ్డిగూడెంలో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉండే ఒక కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పట్టణంలో రెండు కేసులు నమోదైయ్యాయి.
జంగారెడ్డిగూడంలో కానిస్టేబుల్ కరోనా పాజిటివ్
కానిస్టేబుల్‌ను ఏలూరు కోవిడ్ హాస్పటల్ కు తరలించారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ చేసి సూపర్ శానిటేషన్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్ వివరాలను వైద్య అధికారులు సేకరించారు. త్వరలోనే వీరందరికీ ట్రూ నాట్ పరీక్షలు నిర్వహిస్తామని తాడువాయి వైద్య అధికారి రాజీవ్ తెలిపారు.
ఇదీ చదవండిరఘురామకృష్ణరాజుపై తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు