పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పట్టణ సీఐ నాయక్ ఆధ్వర్యంలో ప్రజలకు నమస్కారం చేస్తూ బయటకు రావద్దంటూ కోరారు. విచ్చలవిడిగా తిరుగుతున్న వాహన చోదకులను ఆపి నమస్కారం పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.
చేతులెత్తి మొక్కుతూ.. జనానికి పోలీసుల విజ్ఞప్తి - జంగారెడ్డిగూడెంలో లాక్ డౌన్
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకు రాకుండా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ప్రజలకు నమస్కారం చేస్తూ.. ఎవరూ బయటికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
జంగారెడ్డిగూడెంలో పోలీసుల నమస్కారం