ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలు పాటిస్తే.. అనుమతులు మంజూరు చేస్తాం' - west godavari district

జంగారెడ్డిగూడెంలో లాక్ డౌన్ సడలింపులతో కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనల మేరకు వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలు చేసుకోవాలని పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్, సీఐ నాగేశ్వర నాయక్ కోరారు.

Jangareddigudem municipal commissioner meeting
జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ సమావేశం

By

Published : May 27, 2020, 8:09 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్.. అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనల మేరకు వ్యాపారులు తమ కార్యకలాపాలు చేసుకోవాలని కమిషనర్ శ్రావణ్ కుమార్, సీఐ నాగేశ్వర నాయక్ కోరారు.

లాక్ డౌన్ సడలింపుల్లో కొన్ని దుకాణాలకు మాత్రమే పట్టణంలో అనుమతులు ఇచ్చామని తెలిపారు. వస్త్ర, బంగారు, చెప్పుల దుకాణాలకు అనుమతి ఇవ్వని పరిస్థితుల్లో వారంతా ఆందోళనలో ఉన్నారన్నారు. వ్యాపారులంతా కచ్చితమైన నిబంధనలు పాటిస్తే అనువర్తన అనుమతులు మంజూరు చేస్తామని సీఐ నాయక్ తెలిపారు.

ప్రతి దుకాణంలో వినియోగదారులు భౌతిక దూరం పాటించి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని కోరారు. నిబంధనలను అతిక్రమించిన వ్యాపారులపై చర్యలు తప్పవన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతులు మంజూరు చేశారు.

ఇదీ చదవండి:

యూనిసెఫ్​నే ఆలోచింపజేసిన విశాఖ బాలుడి ప్రశ్న

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details