పశ్చిమగోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూకు కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటల నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఏలూరు నగరం నుంచి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు పట్టణాలు జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారాయి. పల్లెసీమలు సైతం జనతా కర్ఫ్యూకు అండగా నిలిచాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సర్వీసులు, ఆటోలు నిలిపివేశారు. స్వచ్ఛందంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.
పశ్చిమగోదావరిలో జనతా కర్ఫ్యూకు జనం మద్దతు - bandh in west godavari
పశ్చిమగోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. ప్రధాని మోదీ పిలుపులో భాగంగా ప్రజలు బయటకురాలేదు. పట్టణంలోని ప్రాంతాలన్ని మూగబోయాయి.

రద్దీలేని రోడ్డు