ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో జనతా కర్ఫ్యూ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ పిలుపునకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంచి స్పందన లభించింది. తణుకుతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ వంతు బాధ్యతగా కర్ఫ్యూ నిర్వహించారు.

Janata curfew in Tanuku
తణుకులో రోడ్లు

By

Published : Mar 22, 2020, 12:55 PM IST

తణుకులో జనతా కర్ఫ్యూ

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జనతా కర్ఫ్యూని ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణ ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూ పిలుపుతో గ్రామీణ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితం కావడంతో పట్నంలో జన సంచారమే కరువైంది. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయానికి సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం రోజు వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఆదివారం దేవాలయం సైతం మూతపడడంతో వెలవెలపోయింది.

ABOUT THE AUTHOR

...view details