కరోనా వైరస్ నివారించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు పట్టణాల్లో ఉదయం 5 గంటల నుంచి ప్రజలు బయటకు రావడం మానేశారు. శనివారం రాత్రి కావలసిన నిత్యావసర వస్తువులు చాలామంది కొనుగోలు చేశారు. జాతీయ రహదారి సైతం నిర్మానుష్యంగా మారాయి.
జంగారెడ్డిగూడెంలో ప్రజల స్వచ్ఛంద బంద్ - corona news
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూనిపాటిస్తున్నారు.

వాహనాలు లేని రోడ్డు