పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన జనసేన పార్టీ(janasena party) బహిరంగ సభ వాయిదా వేశారు. ఈ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరుకావాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమై.. ప్రాణ నష్టం, పంట నష్టం సంభవించింటంతో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. ఆ సభలో మత్స్యకారుల సమస్యలు, వారి జీవనోపాధికి కలుగుతున్న విఘాతాలపై పవన్ కల్యాణ్ ప్రధానంగా ప్రస్తావించాలని భావించారు. మళ్లీ సభను ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో తెలియజేస్తామని.. పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
జనసేన బహిరంగ సభ వాయిదా.. - నరసాపురంలో జరగాల్సిన జనసేన బహిరంగ సభ వాయిదా తాజా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న.. జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను పార్టీ వాయిదా వేసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ అతలాకుతలమవ్వటంతో.. సభను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నరసాపురంలో జరగాల్సిన జనసేన బహిరంగ సభ వాయిదా