ఏలూరులో జరిగిన వింతవ్యాధికి కారణాలను తెలపాలని డిమాండ్ చేస్తూ... నగర పాలక కార్యాలయం వద్ద జనసేన ఆందోళన చేపట్టింది. వింతవ్యాధికి కారణమైన పంపుల చెరువును ఇప్పటి వరకు శుభ్రం చేయలేదని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. ప్రజల క్షేమాన్ని మరిచిన ప్రభుత్వం.. వారిపై ఆస్తిపన్ను భారం మాత్రం మోపుతోందని విమర్శించారు.
ఏలూరులో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన - latest news in eluru
ఏలూరులో జరిగిన వింతవ్యాధి కారణాలు నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వ్యాధికి కారణమైన పంపుల చెరువును ఇంతవరకు శుభ్రం చేయలేదని జనసేన కార్యకర్తలు ఆరోపించారు.
ఏలూరులో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన
ఆస్తిపన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండీ...విజయవాడలో అమరావతి ఐకాస మహా పాదయాత్ర