రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. వీరవాసరం మండలం మత్స్యపురి ఘటనపై మాట్లాడారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై.. అనుచరులతో కలిసి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండించారు.
జనసేన మద్దతుతో సర్పంచిగా గెలిచిన ఆరేపల్లి శాంత ప్రియ.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తే స్థానిక వైకాపా నాయకులు తీసి పారేశారని నాయకర్ ఆరోపించారు. తమ గెలుపును చూసి ఓర్వలేక.. 20 మంది రౌడీలను తీసుకు వచ్చి గ్రామ ప్రజలను ఎమ్మెల్యే గ్రంథి భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యనికి విరుద్ధంగా ఎమ్మెల్యే ప్రవర్తించడం దౌర్భాగ్యమని ఆగ్రహించారు.