ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్, డీజిల్​పై పన్ను తగ్గించండి: జనసేన - పెట్రోల్ ధరలపై వార్తలు

పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన నిరసన చేపట్టింది. పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో రూ.4 ఎక్కవగా ఉండటం దారుణమని జనసేన నేతలు అన్నారు.

Janasena demands reduction of tax on petrol and diesel
పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలని జనసేన డిమాండ్

By

Published : Sep 22, 2020, 7:39 AM IST

పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఇంధనాలపై విధించే పన్నును 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచి సామాన్యుడిపై భారం మోపిందని ఏలూరు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.

ప్రక్కనే ఉన్న తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోకన్నా లీటరుకు 4 రూపాయలు ఎక్కువగా ధర ఉండటం దారుణమని చెప్పారు. కరోనా కాలంలో ప్రజలు సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాజధానిపై విచారణ అక్టోబర్​ 5కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details