జనబాట పేరుతో జనసేన నేతల ప్రచారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు.జనబాట పేరుతో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్లినా జనసేనకుప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారని అప్పలనాయుడు తెలిపారు. తమ అధినేతపవన్ కళ్యాణ్.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు.జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో రెండు ధనికవర్గాలను కాదని సామాన్యుడైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి