పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి నుంచి దేవరపల్లి వరకు జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలంటూ జనసేన-భాజపా నేతలు పాదయాత్ర చేపట్టారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి నుంచి కొయ్యలగూడెం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య తెలిపారు.
ఐదు సంవత్సరాలుగా తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని జనసేన-భాజపా నేతలు అన్నారు. ఈ రహదారిపై గోతుల వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రహదారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామని జనసేన-భాజపా నాయకులు చెప్పారు.