జంగారెడ్డిగూడెంలో తెదేపా, జనసేన నాయకుల ధర్నా
జంగారెడ్డిగూడెంలో తెదేపా, జనసేన శ్రేణుల ధర్నా - జంగారెడ్డిగూడెంలో తేదేపా, జనసేన నాయకుల ధర్నా
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో... అమరావతికి మద్దతుగా తెదేపా, జనసేన పార్టీ నాయకులు ధర్నా చేశారు. సీఎం జగన్ కేవలం తన స్వార్థం కోసం రాజధానిని మూడుముక్కలుగా చేస్తున్నారని... చింతలపూడి తెదేపా కన్వీనర్ కర్ర రాజారావు మండిపడ్డారు. బోసుబొమ్మ కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ ధర్నాలో హిజ్రాలు పాల్గొని నినాదాలు చేశారు.

జంగారెడ్డిగూడెంలో తేదేపా, జనసేన నాయకుల ధర్నా
TAGGED:
janasena and tdp dharna